My name is KT Rama Rao. I am the IT Minister for the state of Telangana," he introduced himself to the audience but gave a new definition all together to the IT. It's not Information Technology. "For a month now, more particularly for the past one week, it's been Ivanka Trump's name everywhere.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వ కుంట్ల తారక రామారావు వాక్చాతుర్యానికి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ముగ్ధురాలయ్యారు. ఆయనను అమెరికాకు ఆహ్వానించారు. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ అనంతరం కేటీఆర్ అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. బుధవారం గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ రెండో రోజు ఇవాంకా ట్రంప్, కేటీఆర్, చందాకొచ్చార్ తదితరులు వేదికను పంచుకున్న విషయం తెలిసిందే. మహిళా సాధికారతపై వీరు చర్చించారు. దీనికి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సమయంలో ఇవాంకా, కేటీఆర్‌ల మధ్య ఆసక్తికర చర్చ సాగింది.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి కేటీఆర్ బుధవారం జీఈఎస్ సదస్సులో కొంత సరదా చేశారు. రెండో రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి మంత్రి కేటీఆర్ మాడరేటర్‌గా వ్యవహరించారు.
ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు ఉన్నారు.మొదట ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్‌ను మంత్రి కేటీఆర్ వేదిక మీదకు ఆహ్వానించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను కూడా మంత్రి ఆహ్వానించారు. అయితే ఇవాంకాను పరిచయం చేసే సమయంలో మంత్రి కేటీఆర్ కొంత చమత్కారాన్ని ప్రదర్శించారు.